శ్యామల నవరాత్రి 2022 తేదీలు

field_imag_alt

సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా నాలుగు నవరాత్రులు వస్తాయి.  అవి 

  1. చైత్ర మాసంలో వసంత నవరాత్రి 
  2. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రి
  3. అశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి 
  4. మాఘ మాసంలో శ్యామల నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి

చైత్ర, అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు. మిగిలిన రెండు గుప్త నవరాత్రులు. ఇవి కేవలము సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా  జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో  తొమ్మిదిరోజుల పాటు దుర్గాఅమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా  అలంకరించి పూజలు చేస్తారు. 

దక్షిణ భారత దేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి. ఈ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు,  విద్య, ఐశ్వర్యం లబిస్తాయి. అంతేకాక బార్య భర్తల మద్య అన్యోన్యం, పెళ్లి కానివారికి త్వరగా పెళ్లి జరుగుతుందని  శాస్త్రం చెబుతుంది.

భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో ఙ్ఞానం  శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన  శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది.  ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు.  ఈ తల్లిని దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు. 

 ఈ అమ్మరికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది? 
 
 హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి.

శ్యామల నవరాత్రి 2022 తేదీలు

ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు ఫిబ్రవరి 2 Wednesday నుండి February 10 Thursday ఉన్నవి. 

Day-1 Puja: లఘు శ్యామల (Laghu Śyāmala)

Date2nd February 2022 Wednesday

TithiMagha Sukla Padyami

Tithi TimeJan 02, 3:42 AM - Jan 03, 12:03 AM

Day-2 Puja: వాగ్వాధిని శ్యామల(Vāgvādinī Śyāmala)

Date3rd February 2022 Thursday

TithiMagha Sukla Vidhiya

Tithi TimeFeb 02, 8:31 am - Feb 03, 6:16 am

Day-3 Puja: నకుల శ్యామల (Nakulī Śyāmala)

Date4th February 2022 Friday

TithiMagha Sukla Tadiya

Tithi TimeFeb 03, 6:16 am - Feb 04, 4:38 am

Day-4 Puja: హసంతి  శ్యామల (Hasanti Śyāmala)

Date5th February 2022 Saturday

TithiMagha Sukla Chavithi

Tithi TimeFeb 04, 4:38 am - Feb 05, 3:47 am

Day-5 Puja: సర్వసిద్ది మాతంగి (Sarvasiddhi Mātaṅgi)

Date6th February 2022 Sunday

TithiMagha Sukla Panchami 

Tithi TimeFeb 05, 3:47 am - Feb 06, 3:47 am

Day-6 Puja: వాస్య మాతంగి (Vaśya Mātaṅgi)

Date7th February 2022 Monday

TithiMagha Sukla Shashti

Tithi TimeFeb 06, 3:47 am - Feb 07, 4:38 am

Day-7 Puja: సారిక శ్యామల (Sārikā Śyāmala)

Date8th February 2022 Tuesday

TithiMagha Sukla Sapthami

Tithi TimeFeb 07, 4:38 am - Feb 08, 6:16 am

Day-8 Puja: శుక శ్యామల (Śuka Śyāmala)

Date9th February 2022 Wednesday

TithiMagha Sukla Ashtami

Tithi TimeFeb 08, 6:16 am - Feb 09, 8:31 am

Day-9 Puja: రాజ మాతంగి / రాజ శ్యామల (Rāja Śyāmala)

Date10th February 2022 Thursday

TithiMagha Sukla Navami

Tithi TimeFeb 09, 8:31 am - Feb 10, 11:08 am

పూజా విధానం

ఈ దేవికి నిత్య పూజాతో పాటు మాతంగి/శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలయితే చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి.  ప్రసాదం గా పాయసాన్ని నివేదన చేయండి. 

తప్పకుండా శ్యామల షోడశ నామా స్తోత్రం పఠిచండి.

శ్యామల షోడశ నామా స్తోత్రం

హయగ్రీవ ఉవాచ |
తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః |
తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧
 
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |
మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || ౨

వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || ౩

సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |
ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |
తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయమ్ || ౪

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే శ్రీశ్యామలా షోడశనామ స్తోత్రమ్ |

ఈ స్తోత్రము పఠించిన వారు ముల్లోకాలు జయించ గలరు.

షోడశ నామా స్తోత్రం చదవలేని వాళ్ళు షోడశ నామాలు అయిన ఈ క్రింది 16 నామాలు తో పూజ చేసుకోండి. అవి 

1. సంగీత యోగిని 
2. శ్యామా
3. శ్యామలా
4. మంత్ర నాయిక
5. మంత్రిని
6. సచివేశి
7. ప్రధానేశీ
8. శుక ప్రియ
9. వీణా వతి
10. వైణికి
11. ముద్రిని
12. ప్రియక ప్రియా
13. నీప ప్రియ
14. కదంబెశి
15. కాదంబ వనవాసిని
16. సదామలా

ఈ  నవరాత్రులు మములువి కావు, చాలా విశేషమైనవి.అందరూ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని ని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహము  పొందండి.