ఈ వీడియోలో తెలుసుకునే విషయం, చాలా మంది కార్తీకమాసంలో చాలా రోజులు, వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి, సంకటహర చతుర్థి, కేదారేశ్వర నోములు, అట్లతద్ది నోములు, భీష్మ ఏకాదశి ఇలాంటి సందర్భాల్లో ఉపవాసం ఉంటూ కూడా ఉపవాసం ఉండి, సాయంత్రం బాగా నక్షత్రాలకి నమస్కారం చేసుకుని, నక్షత్రదర్శనం పూర్తి అయినటువంటి పిదప, ఆ ఉపవాసం తీర్చుకుని భోజనం చేసి ఆ ఉపవాసం ఫలితాన్ని పొందుతారు. అసలు నక్షత్రాలకి ఎందుకు నమస్కారం చేస్తాం? నక్షత్రాలు లో ఎవరెవరు ఉంటారు? అనే దాని గురించి చెబుతుంటే దానికి ఒక విషయం ముందు మనం తెలుసుకోవాలి.
ఆ నక్షత్రాల మండలంలో అంటే ధ్రువ మండలం లో, శంకరుడు కొలువై ఉంటాడట. ఎలా ఉంటాడో చెబుతున్నాడు. శంకరుడు ఏ సందర్భంలో ఈ నక్షత్ర మండలం ప్రదోష కాలం తరువాత, నక్షత్రాలు ఆవిర్భవించిన తరువాత, చంద్రోదయం తర్వాత, 27 నక్షత్రాల తోటి, 9 నవ గ్రహాల తోటి, ఎనిమిది మంది అత్యధిక పాలకుల తోటి, విగ్నేశ్వరుడు, నంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమక్షంలో పార్వతీదేవిని వామ భాగంలో అర్థ భాగంగా ఆయన పార్వతీదేవిని అర్ధ జటాజూటము నందు గంగాదేవి తో, తల మీద చంద్రవంక తో, నాగాభరణాలు తో, భగభగమండే టటువంటి త్రిశూలం చేతిలో పట్టుకొని, దేవతలు రాక్షసులు నమస్కారం చేస్తూ ఉండగా సురాసుర నమస్కృతాం (మంత్రం) అంటే, దేవతలు రాక్షసులు కూడా నమస్కారం చేస్తూ ఉండగా, వెండి పాత్రతో అమృతం తాగుతూ, ప్రతి రోజు కూడా ఈ రాత్రి పూట నక్షత్ర మండలంలో భోగము అనుభవిస్తూ ఉంటాడట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రతిరోజు కూడా జరిగి తీరుతుంది.
ఎక్కడ అంటే నక్షత్ర మండలంలో ప్రతి రోజూ జరుగుతూనే ఉంటుంది. కనుక ఆ శంకరుడు ఈ రాత్రి పూట నక్షత్ర మండలంలో సకల దేవతలు, పార్వతీ దేవితో కలిసి ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా అలా నక్షత్ర దర్శనం చేస్తే, అష్టదిక్పాలకుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మనం శాస్త్ర బద్ధంగా చేసినటువంటి ఈ ఉపవాసం ఫలించి సకల దేవతల అనుగ్రహం తో, మనకి సకల దోషాలు తొలగి నవగ్రహ దోషాలు తొలగి, బ్రతికినంత కాలం ఆయురారోగ్యాలతో బ్రతికి, సిరి సంపదలు కలిగి అంత్యమున చనిపోయిన టువంటి తర్వాత మనం శంకరుడిలో లీనమైపోతాం. అందుకే లాయకరకుడైన శంకరుడిలో మనం లయం అయిపోతాం.
కనుక ఈ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా తెల్సుకోవాల్సిన సాయంత్రం నక్షత్ర దర్శనం అంటే ఇదే మాట. ఈ సకల దేవతలు పార్వతీ పరమేశ్వరులు అక్కడ కొలువై ఉంటారు కనుక, ఆ జగత పితరౌ వందే (మంత్రం), అంటే పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేసి, ఈ ఉపవాసం తీర్చుకుంటే, ఆ ఉపవాసం ఫలం మనకు దక్కి అందరూ సుఖశాంతులతో ఉంటారు అని చెప్పి, ఆ నక్షత్ర దర్శనం చేస్తుంటారు. అలాగే ఉపవాసం ఉండే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఆచరించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా అందరికీ తెలియపరుస్తున్నాను.
వ్యాఖ్యానించండి