వైకుంఠ ఏకాదశి ఏరోజు?
శ్రీ శార్వరి నామ సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే ఈ 2020 సంవత్సరం డిసెంబరు 25వ తారీకు శుక్రవారం రోజు మనకు ఏకాదశి వస్తుంది . ఈ ఏకాదశి మార్గశిరమాసంలో ఉన్నది కనుక,దనుర్మాసంలోఉన్నది కనుక ,విష్ణు మూర్తికి ఎంతో ప్రీతి కలిగింది కనుక,దీనిని వైకుంఠ ఏకాదశి అని చెప్పుకుంటుంటారు .
ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు?
ఈ కాలంలో శ్రీరంగంలో కానీ ,వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఆచరించే అనేక దేవాలయాల్లో వైష్ణవ, శ్రీవైష్ణవ,వైగానస,పాంచరాత్రాది అనేక రకాలైనటువంటి ఆగమాల ప్రకారం వైష్ణవ ఆలయాల్లో అన్నింట్లో కూడా సూర్యోదయానికి ముందే ఈ స్వామివారికి చాలావరకు కార్యకలాపాలు అయిపోయి తర్వాత భక్తులకు అనేక రకాలుగా తీర్థప్రసాదాలు, వినోద కార్యక్రమాలు, భజనలు ఇవన్నీ కూడా క్షేత్రాలలో అందిస్తుంటారు. ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా ఉంది దీనికి కారణం ఒక సందర్భంలో కొంతమంది రాక్షసులు వేదాలను దొంగిలించుకుపోయారు. వేదాలు లేకపోయేటప్పటికి దేవతలకు అందరికీ ఇబ్బంది కనుక అందరూవచ్చి శ్రీమన్నారాయణ పాదాల దగ్గరకు చేరారు. మీరు ఇబ్బంది పడవద్దు అని శ్రీమన్నారాయణుడు నేను తీసుకు వస్తానని చెప్పి, విష్ణుమూర్తి వేదాల కొరకు బయలుదేరారు . పాతాళలోకంలో చేరినటువంటి రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి తీసుకొని వచ్చే దానికి వాళ్లమీద యుద్దానికి దండెత్తి వెళ్ళింది ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార నుండి బయలుదేరి వెళ్లాడు. భగవంతుడు రాక్షసుల పైకి యుద్ధానికి వెళుతున్నాడు గనుక ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని జయజయధ్వానాలతో వేదాలను తీసుకొచ్చేదానికి సాగనంపారు. తరువాత కొద్ది సమయంలోనే మహా శక్తివంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి తీసుకొని ఉత్తరద్వారం గుండా వైకుంఠం ప్రవేశించారు .ఈ సందర్భంగా దేవతలు,ఋషులు అందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని వైకుంఠంలో ఆ ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకొని ఆనందంతో వాళ్ళందరూ కూడా స్వామివారికి రకరకాలైన పుష్పాలు చల్లి లోపలికి ఆహ్వానించారు . వేదాలను తీసుకొని వచ్చిన దానికి దేవతలూ ,ఋషులూ ,అందరూ ఆనందంగా ఉండటం చూసినటువంటి శ్రీమన్నారాయణడు చాలా ఆనందంగా లోపలికి ప్రవేశించాడు . కనుక ముక్కోటి దేవతలు వైకుంఠమునకు వచ్చి స్వామివారికి స్వాగతం పలికారు, నమస్కారాలు చేశారు,ఎన్నో స్తోత్రాలు పాడారు గనుక ఈ రోజున వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని చెప్పుకొనుట జరిగింది. స్వామివారు యుద్దానికి వెళ్ళటం, తిరిగి వేదాల తోటి తిరిగి రావడం కూడా ఉత్తర ద్వారం గుండానే జరిగింది కనుక, ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని దేవతలు,ఋషులు అయితే స్వామివారి దర్శనం పొందారో అట్లాగే ఇవాళ అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తరద్వారం ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా ఉత్తర ద్వారం ఉన్న దగ్గర అలాగే ఉత్తర ద్వారం దగ్గర పెడుతున్నారు. ఉత్తరద్వారం లేని దగ్గర కూడా కృత్రిమంగా ఒక ఉత్తరద్వారం తయారు చేసి అక్కడ స్వామివారిని ఉంచి ,ఆ ఒక్క రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చే ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ కాలంలో అందరూ కూడా ధనుర్మాసంలో వచ్చేది కనుక అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ,తలకి పోసుకొని ఆ స్వామి వారిని మన ఇంట్లో గనుక సేవించే పనైతే మంచి తులసిదళాలు తోటి ,కలువ పూలు తోటి , జాజి పూలతోటి ,ఎర్ర గన్నేరు పూలతోటి ,ఇలా మంచి విష్ణుమూర్తికి ఇష్టమైనటు వంటి పూలతోటి సేవించి , విష్ణుమూర్తికి ఇష్టమైన కట్టె పొంగలి తయారుచేసి నైవేద్యం పెట్టాలి . ధనుర్మాసమంతా కూడా స్వామివారికి కట్టె పొంగలి నైవేద్యం పెడతారు.
వైకుంఠ ఏకాదసి 2020 గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి వీడియో చూడండి....
వ్యాఖ్యానించండి