ఈ సంవత్సరం 2020 December నుండి నాలుగు నెలల్లో పెద్దగా శుభకార్యాలేవీ చేసుకునే దానికి మంచి రోజులు లేవు. గురుమూడమి శుక్రమూడమి తో కొంత ఇబ్బంది కలుగుతుంది.
కనుక ఎవరైనా ఏదైనా శుభకార్యం చేయాలంటే, ఈ జనవరి 11 వ తారీకులోపలే చూడండి . తరువాత కేవలం 1 ,2 ముహూర్తాలే ఉన్నాయి అని తెలియపరుస్తున్నాము. ఈ శార్వారి నామ సంవత్సరం జనవరి 15 వ తారీకు నుండి శుక్రవారం నుంచి 11 -2 -2021 గురువారం దాకా అంటే జనవరి 15 వ తారీకు నుండి ఫిబ్రవరి 11 వ తారీకు గురువారం వరకు గురు మూడమి ఉంది కనుక ఎలాంటి శుభకార్యాలు లేవు. ఆ 11 వ తారీకు నుంచి మళ్లీ ఇరవై రెండో తారీకు దాకా మళ్ళీ 2 ముహూర్తాలే ఉన్నాయి. అది 15 తారీకు 20వ తారీకు మాత్రమే ఉన్నాయి . అదికూడా గృహారంభానికి మాత్రమే ఉన్నాయి . ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే పనికొస్తాయి.
ఫిబ్రవరి 22 వ తారీకు నుండి అంటే 22- 2- 2021 నుండి 28 -4-2021 అంటే ఏప్రిల్ 28వ తారీకు దాకా అంటే వచ్చే ప్లవనామ సంవత్సరం 28-4 -2021 దాకా శుక్రమూఢమి ఉన్నది. ఫిబ్రవరి 22 వ తారీకునుండి ఏప్రిల్ 28వ తారీకు దాకా ఏ శుభకార్యాలు లేవు . కేవలం ఫిబ్రవరి 15వ తారీకు, ఫిబ్రవరి 20వ తారీకు మాత్రమే ఏదైనా మంచి శుభకార్యాలు ఉన్నాయి. అవి కూడా ఇల్లు శంకుస్థాపన చేసుకునే దానికి పనికొచ్చే ముహూర్తాలు గా ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న మంచి పనులకి కూడా ఇవి పనికోస్తాయని తెలియపరుస్తున్నాను . కనుక ఇంకా అప్పుడప్పుడు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మౌఢ్యమి కాలంలో ముహూర్తాలు గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి వీడియో చూడండి....
వ్యాఖ్యానించండి